అక్క అంటే ఆ తమ్ముడికి ఎనలేని మమకారం. పెళ్లి కూడా చేసుకోకుండా అక్క కుటుంబమే తనదిగా భావించి.. నిరంతరం వారి ఉన్నతి కోసం తపనపడేవారు. చివరికి రాఖీ పండుగ రోజే ఆ అక్కాతమ్ముడు అనంత లోకాలకు చేరారు. తోబుట్టువుల పండుగ నాడు అక్క అనారోగ్యంతో మృతి చెందటంతో.. అది తట్టుకోలేక తమ్ముడు కూడా గుండెపోటుతో మరణించారు.
TRAGEDY: రాఖీ రోజు విషాదం.. అక్క మరణాన్ని తట్టుకోలేక తమ్ముడు మృతి! - తెలంగాణ వార్తలు
అక్కంటే పంచప్రాణాలు ఆ తమ్ముడికి. తల్లిలా లాలించే అక్క మీద మమకారంతో పెళ్లి కూడా చేసుకోకుండా అక్క కుటుంబమే తన కుటుంబంగా భావించారు. అందుకే జీవితాంతం వారితోనే ఉండిపోయారు. కానీ చివరకు తోబుట్టువుల బంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి రోజే వారిద్దరూ తనువు చాలించారు. అనారోగ్యంతో అక్క మృతి చెందటంతో... ఆ వార్త విని తమ్ముడి గుండె ఆగింది.
రాఖీ పౌర్ణమి రోజే అక్కాతమ్ముడు మృతి, అక్క మరణం తట్టుకోలేక తమ్ముడు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా అనకాపల్లి శారదా కాలనీకి చెందిన లోలలితాదేవి.. కుమారై పద్మినీ రాణితో పాటు ఆమె తమ్ముడు ఎన్ఆర్ఎస్ రామచంద్రరాజు కలిసి నివసిస్తున్నారు. లలితా దేవి(84) ఆదివారం నాడు అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె అంత్యక్రియలు ముగించుకుని ఇంటికి వచ్చాక రామచంద్రరాజు(76) తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాసేపటికి గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. రాఖీ పౌర్ణమి నాడే ఆ అక్కాతమ్ముల మరణం స్థానికులను కంటతడి పెట్టించింది.