Chain Snatcher Arrest in Ahmedabad : హైదరాబాద్‌లో వరుస గొలుసు దొంగతనాలతో కలకలం సృష్టించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్‌లో ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. గొలుసు దొంగతనాలకు పాల్పడింది పాత నేరస్థుడు ఉమేశ్‌గా గుర్తించారు.
Chain Snatcher Arrest in Ahmedabad : హైదరాబాద్‌లో చోరీలు చేశాడు.. అహ్మదాబాద్‌లో పట్టుబడ్డాడు - చైనస్నాచర్ ఉమేశ్ అరెస్టు
11:44 January 22
Chain Snatcher Arrest in Ahmedabad : హైదరాబాద్‌లో చోరీలు చేశాడు.. అహ్మదాబాద్‌లో పట్టుబడ్డాడు
Hyderabad Chain Snatcher Arrest in Ahmedabad : హైదరాబాద్‌లో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడిన నిందితుడు ఉమేశ్ అహ్మదాబాద్ పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు.. అతని కోసం బృందాలుగా గుజరాత్ వెళ్లారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అహ్మదాబాద్‌లో అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఈ నెల 19న ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల లోపు మూడు కమిషనరేట్ల పరిధిలో 5 గొలుసు దొంగతనాలు చేశాడు. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడు. అక్కడి నుంచి మారేడ్‌పల్లి వచ్చి ఓ మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లాడు. తుకారాంగేట్ పీఎస్ పరిధిలో మరో మహిళ మెడలో గొలుసు దొంగతనం చేశాడు. మేడిపల్లి వైపు వెళ్లి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ గొలుసు చోరీ చేశాడు. సాయంత్రం 5 గంటల సమయంలో మేడిపల్లిలోని సంపూర్ణ హోటల్ వెళ్లి టీ తాగిన ఉమేశ్.. ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. నిందితుడు గొలుసు దొంగతనాలకు ఉపయోగించిన స్కూటీని జియాగూడలో ఈ నెల 18న దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Chain Snatcher Umesh Arrest in Ahmedabad : అహ్మదాబాద్ నుంచి వచ్చిన నిందితుడు నాంపల్లిలోని ఓ హోటల్ లో గది అద్దెకు తీసుకున్నాడని నిర్ధరించారు. ఆధార్ కార్డు సహా.. ఫోన్ నెంబర్‌ను కూడా లాడ్జ్ నిర్వాహకులకు ఇచ్చాడు. చోరీ జరిగిన తర్వాత పోలీసులు ఆసిఫ్‌నగర్, నాంపల్లి ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితుడు లాడ్జిలో బస చేసినట్లు గుర్తించి.. ఆధారాలు సేకరించారు. నిందితుడి ఫోన్ ఆధారంగా అహ్మదాబాద్‌లో ఉన్నాడని గుర్తించిన సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొలుసు దొంగతనాల నిందితుడు ఉమేశ్‌పై అహ్మదాబాద్, ముంబయిలోనూ కేసులున్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇదీ చదవండి :Gold seized in shamshabad : శంషాబాద్ విమానాశ్రయంలో 2.7 కిలోల బంగారం పట్టివేత
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!