పర్యాటక వీసాతో ఉగాండా నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ లొకాంటో డేటింగ్ యాప్ ద్వారా వీరు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. లొకాంటో డేటింగ్ వెబ్సైట్లో వ్యభిచార నిర్వాహకుల వివరాలు సేకరించిన మానవ అక్రమ రవాణా నిరోధక బృందం, చైతన్యపురి పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. చైతన్యపురిలోని ఓ లాడ్జ్‌కు రావాల్సిందిగా నిర్వాహకురాలు సూచించడంతో.. సాధారణ దుస్తుల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు ఉగాండా యువతులు అక్కడికి రాగానే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఉగాండా నుంచి వచ్చి వ్యభిచారం.. యువతులు అరెస్ట్ - uganda human traffickers arrested in chaitanyapuri
పర్యాటక వీసాతో నగరానికి వచ్చి.. ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తూ ఐదుగురు మహిళలు పోలీసులకు పట్టుబడ్డారు. ప్రత్యేకంగా ఆపరేషన్ నిర్వహించిన రాచకొండ, మానవ అక్రమ రవాణా నిరోధక బృందం వారిని వల వేసి పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురు మహిళలు అరెస్ట్
వారి నుంచి 22గ్రాముల మత్తుపదార్థాలు, 5 చరవాణీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీసా గడుపు తీరినా నగరంలోనే ఉంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఇదీ చదవండి:జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
Last Updated : May 21, 2021, 7:26 PM IST