తెలంగాణ

telangana

ETV Bharat / crime

డివైడర్‌ను ఢీ కొట్టిన ద్విచక్రవాహనం.. ఇద్దరు యువకులు మృతి - accident news in sanagareddy district

ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జరిగింది.

accident news in sanagareddy district
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

By

Published : Jun 13, 2021, 9:56 PM IST

ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరబాద్‌లోని 65వ నంబర్ జాతీయ రహదారిపై జరిగింది.

కర్ణాటక రాష్ట్రంలోని చిద్రూప గ్రామానికి చెందిన అఫాన్(24), విఖార్(34) అనే యువకులు వారి స్వగ్రామం నుంచి హైదరాబాద్‌ వెళ్లడానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని 65వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న క్రమంలో వారి వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. తీవ్రగాయలతో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జహీరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:కొంపల్లి సినీప్లానెట్​ ఎదురుగా రోడ్డు ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details