వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చెరువులు, బావులు, కాలువల్లో దిగి ప్రమాదవశాత్తు పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన మూడు రోజుల్లోనే ఇలాంటి ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. సరదాగా నీటిలో దిగి మృత్యుఒడిలోకి చేరుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో ఈత కోసం కొండపోచమ్మ జలాశయంలో దిగి.. ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. హైదరాబాద్‌కు చెందిన అక్షయ్ వెంకట్(28), రాజన్ శర్మ(28)లు సరదాగా జలాశయంలో దిగి.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో నీటిలో కొట్టుకుపోయారు.
కొండపోచమ్మ జలాశయంలో ఇద్దరు యువకులు గల్లంతు - siddipet district latest news
కొండపోచమ్మ జలాశయంలో ఇద్దరు యువకులు గల్లంతు
13:40 May 22
కొండపోచమ్మ జలాశయంలో ఇద్దరు యువకులు గల్లంతు
గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినా.. ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు, గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇవీ చూడండి..సీతారామ ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరు మృతి
Last Updated : May 22, 2022, 2:15 PM IST