తెలంగాణ

telangana

ETV Bharat / crime

rape: బహిర్భూమికి వెళ్లిన మైనర్​పై అత్యాచారం - అత్యాచారం వార్తలు

ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఓ మైనర్​పై ఇద్దరు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

rape
rape

By

Published : Jul 15, 2021, 12:50 AM IST

ఏపీలోని ప్రకాశంజిల్లా కురిచేడు ఆవులమంద గ్రామంలో ఓ మైనర్​ బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఇద్దరు యువకులు అత్యాచారం జరిపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం తెల్లవారుజామున బాలిక బహిర్భూమికి వెళ్లగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వెంటాడారు. బాలికను అడ్డుకుని అరవకుండా నోటిని గట్టిగా మూసివేసి తమతో పాటు గ్రామ శివారు ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లారు. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లిన వంశీ, కృష్ణలు అఘాయిత్యానికి తెగబడ్డారు.

ఇద్దరు నిందితుల్లో ఒకరు అత్యాచారం చేయగా మరొకరు అందుకు సహకరించినట్లు బాధితురాలి తల్లి తెలిపింది. ఆ తరువాత యువతిని గట్టిగా కొట్టి గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యారు. ఒంటరిగా అక్కడే వదిలేయడంతో భయపడిన బాధితురాలు తనను కనీసం ఇంటి వద్ద వదిలేయండంటూ ప్రాధేయపడింది. కానీ.. కనికరించని నిందితులు బాలికను చంపేస్తామని బెదిరించి ఘటనాస్థలి నుంచి వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: suhasini arrest: నిత్య పెళ్లికూతురు సుహాసిని అరెస్ట్.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ABOUT THE AUTHOR

...view details