తెలంగాణ

telangana

ETV Bharat / crime

accident: లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి - వనపర్తి తాజా నేర వార్తలు

వనపర్తి జిల్లా ముమ్మళ్లపల్లి వద్ద ముందుగా వెళ్తున్న లారీని వెనక నుంచి వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

two-youngmans-died-in-wanaparthy-road-accident
లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి

By

Published : Jun 28, 2021, 1:01 PM IST

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న లారీని వెనుక వైపు నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు... బాధితుల వివరాలు సేకరించారు. మృతులు అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఆనంద్‌, పామిడికి చెందిన నూర్‌ అహ్మద్‌గా గుర్తించారు. ఆనంద్ కుమార్ బంగారు వ్యాపారం చేస్తుండగా... నూర్‌ అహ్మద్‌ డ్రైవర్​గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరు పని నిమిత్తం హైదరాబాద్​ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఇదీ చూడండి:Land Grabbing: రామానుజా... కనవా ఈ కబ్జా!

ABOUT THE AUTHOR

...view details