తెలంగాణ

telangana

ETV Bharat / crime

two died in wall collapse Shankarpally : ఇంటి గోడ కూలి ఇద్దరు యువకులు దుర్మరణం - రంగారెడ్డి వార్తలు

wall collapse
wall collapse

By

Published : Dec 26, 2021, 10:32 AM IST

Updated : Dec 26, 2021, 1:54 PM IST

10:29 December 26

పాత ఇంటి గోడ కూలి.. ఇద్దరు యువకులు దుర్మరణం

two died in wall collapse at shankarpally :రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పరిధిలోని బుల్కాపూర్‌లో విషాదం జరిగింది. పాత ఇంటి గోడ కూలి ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. పాత ఇంటి గోడను కూలుస్తుండగా ప్రమాదవశాత్తు మీద పడడంతో మధు(27), శ్రీకాంత్(22) ఘటనాస్థలిలోనే మృతి చెందారు.

పాత ఇంటి మరమ్మతుల కోసం గోడను కూల్చుతున్న సమయంలో ఒక్కసారిగా కూలిపోయిన గోడ మధు, శ్రీకాంత్​పై పడింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ యువకులిద్దరికీ గతేడాదే వివాహమైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి :women suicide in Godavarikhani : ఆస్పత్రిలో ఉరేసుకుని బాలింత ఆత్మహత్య

Last Updated : Dec 26, 2021, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details