తెలంగాణ

telangana

ETV Bharat / crime

సైడ్ ఇవ్వమన్నందుకు కత్తులతో దాడి.. ఇద్దరి పరిస్థితి విషమం

attack: ఆటోకు దారి కోసం కొట్టిన హారన్.. ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసింది. పరస్పరం దాడి చేసుకోగా.. ఓ వర్గం కత్తులతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సైడ్ ఇవ్వమన్నందుకు కత్తులతో దాడి.. ఇద్దరి పరిస్థితి విషమం
సైడ్ ఇవ్వమన్నందుకు కత్తులతో దాడి.. ఇద్దరి పరిస్థితి విషమం

By

Published : Jun 23, 2022, 7:17 PM IST

attack: నిజామాబాద్​ జిల్లా కేంద్రం వర్ని చౌరస్తాలో బుధవారం అర్ధరాత్రి కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. కత్తులతో ఓ వర్గంపై దాడికి పాల్పడ్డారు. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నాగారానికి చెందిన సాయికుమార్ తన స్నేహితులు భాను, ప్రభాకర్, విష్ణు, సాయికృష్ణతో కలిసి ఆటోలో నగరంలోని రైల్వే స్టేషన్​ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సాయినగర్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఆటో ముందు వెళ్తుండగా.. సైడ్ కోసం ఆటో డ్రైవర్ హారన్ కొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఖాజా అనే వ్యక్తి ఆటోను ఆపి.. అందులో ఉన్న వారిపై దాడికి పాల్పడ్డాడు.

ఇదే సమయంలో అక్కడే ద్విచక్ర వాహనంపై ఉన్న అజ్జూ అనే వ్యక్తి రెచ్చగొట్టడంతో ఖాజా, జుబేర్, సాదాబ్, సలాం, ఫెరోజ్​లు కలిసి సాయికృష్ణ, విష్ణులపై కత్తులతో దాడి చేశారు. ఘటనలో ఇద్దరికీ వీపు వెనుక భాగంలో గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు ఐదో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నిన్న రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో సాయికుమార్ తన స్నేహితులతో కలిసి ఆటోలో వెళ్తుండగా.. కొందరు ముస్లిం యువకులు రెండు ద్విచక్రవాహనాలపై ఆటోకు అడ్డంగా వచ్చారు. సైడ్ కోసం ఆటో డ్రైవర్ హారన్ కొట్టడంతో బైకులపై ఉన్న వాళ్లు బూతులు తిట్టారు. ఈ క్రమంలోనే వారిరువురి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. వర్ని చౌరస్తా వద్దరు రాగానే ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఇందులో విష్ణు, సాయికృష్ణలు కత్తిపోట్లకు గురయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాము. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నాము.-రాజేశ్వర్ గౌడ్, ఎస్సై

ABOUT THE AUTHOR

...view details