తెలంగాణ

telangana

ETV Bharat / crime

Two died in hasanparthi : నూతన సంవత్సర వేడుకల్లో విషాదం.. ఈతకు దిగిన ఇద్దరు మిత్రులు మృతి - ఈతకు వెళ్లిన ఇద్దరు మిత్రులు మృతి

Two died in hasanparthi: నూతన సంవత్సరం వేడుకలు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈతకు వెళ్లిన ఇద్దరు మిత్రులు తల్లిదండ్రులకు కన్నీటిని మిగిల్చి వెళ్లిపోయారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్​పర్తిలో జరిగింది.

two dead
two dead

By

Published : Jan 2, 2022, 5:38 AM IST

Two died in hasanparthi : ఈత సరదా రెండు కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఇద్దరు మిత్రులు మృతి చెందారు. హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం మునిపల్లి శివారులోని ఓ కుంటలో ఈతకు వెళ్లిన ఇద్దరు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు.

కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా అయిదుగురు స్నేహితులు కలిసి మద్యం సేవించారు. అనంతరం ధర్మసాగర్​ మండలం రపకపల్లెకు చెందిన వాసుకుల ఆకాశ్​, భూపాల పల్లి మండలం చెల్పూర్​కు చెందిన శ్రీకర్​... కుంటలో ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. మిగిలిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాను వెలికితీసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:New Year Road accidents: ప్రమాదాలతో ప్రారంభమైన న్యూఇయర్​.. ఓ ఎస్సై సహా 12 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details