Youngsters drown in canal: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఆ విషాదకర ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగింది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందటంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తికి చెందిన అంబాల రమేష్‌కు ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు వంశీ ఇంటర్ మధ్యలోనే చదువు మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు.
ప్రయత్నం చేసినా.. ఫలితం దక్కలేదు:నాలుగు రోజుల క్రితం కాజిపేటలో ఉంటున్న మేనత్త కుమారుడు వరుణ్ దేవుడి పండుగకి ఎల్కతుర్తికి వచ్చాడు. వరుసకి వారిద్దరు బావ బామర్ధులు. ఈరోజు ఉదయం ఇద్దరు ఇంటి పక్కనే ఉన్న కాలువ వద్దకు బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కెనాల్‌లో పడిపోయి గల్లంతయ్యారు. ఇదంతా వాళ్ల చిన్నాన్న అంబల స్వామి చూస్తుండగానే జరగడంతో... వెంటనే ఆయన కెనాల్‌లో దూకి కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది.