తెలంగాణ

telangana

ETV Bharat / crime

లైవ్​ వీడియో: న్యాయవాదిపై ఇద్దరు యువకులు దాడి - బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వేణుపై దాడి

న్యాయవాదిపై ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన హన్మకొండలో వెలుగు చూసింది. రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసిన న్యాయవాద దంపతుల హత్య నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Two young men attack a lawyer at Hanmakonda in warangal urban
లైవ్​ వీడియో: న్యాయవాదిపై ఇద్దరు యువకులు దాడి

By

Published : Feb 19, 2021, 9:51 AM IST

న్యాయవాద దంపతుల హత్య జరిగిన మరుసటి రోజే.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓ న్యాయవాదిపై ఇద్దరు యువకులు దాడి చేశారు. హంటర్ రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వేణు స్వల్పంగా గాయపడ్డారు.

లైవ్​ వీడియో: న్యాయవాదిపై ఇద్దరు యువకులు దాడి

ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. న్యాయవాది ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఏటీఎం వద్ద ఏర్పడిన వాగ్వాదం వల్ల ఈ దాడి జరిగిందని సమాచారం.

రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం కృషి చేసే వారిపై జరిగే దాడులను ఖండిస్తున్నారు. విచక్షణా రహితంగా దాడులు, హత్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: 'న్యాయవాదుల హత్యలపై స్వతంత్ర న్యాయవిచారణ జరిపించాలి'

ABOUT THE AUTHOR

...view details