రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు సర్వీస్ రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో గాయాలైన ఇద్దరు యువకులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చెన్నమ్మ హోటల్ వద్ద కారు అదుపు తప్పింది.
శంషాబాద్లో కారు బీభత్సం.. ఇద్దరికి గాయాలు - ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు కారు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
శంషాబాద్ సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై కారు బోల్తా పడింది. ఈ ఘటనలో గాయాలపాలైన ఇద్దరు యువకులను ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఓఆర్ఆర్పై కారు ప్రమాదం, శంషాబాద్లో రోడ్డు ప్రమాదం
కారులో ఉన్న ఇద్దరు యువకులు మద్యం సేవించి ఉండడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:తండ్రి అకృత్యాలు భరించలేక ఇంటి నుంచి పరార్.. తర్వాత ఏం జరిగిందంటే.!