తెలంగాణ

telangana

ETV Bharat / crime

సరదాగా ఈతకు వెళ్లారు.. అనంత లోకాలకు చేరుకున్నారు.. - వాగులో దిగి ఇద్దరు యువకులు మృతి

Two young man died After falling into the river: ఈత సరదా ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. వాగులో ఈతకు దిగి.. నీటి ప్రవాహం పెరగడంతో గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు వారి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు శంషాబాద్​లో చోటుచేసుకుంది.

సరదాగా ఈతకు వెళ్లారు.. అనంత లోకాలకు చేరుకున్నారు..
సరదాగా ఈతకు వెళ్లారు.. అనంత లోకాలకు చేరుకున్నారు..

By

Published : Oct 4, 2022, 12:56 PM IST

Two young man died After falling into the river: హైదరాబాద్​ శివారు శంషాబాద్​లో విషాదం చోటుచేసుకోంది. నానాజీ వాగులో నిన్న ఇద్దరు యువకులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న శంషాబాద్​ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లతో గాలించగా.. ఈ రోజు ఉదయం యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

పోలీసుల కథనం ప్రకారం.. జూకల్​ ప్రాంతానికి చెందిన మహేందర్, నదీమ్ అనే ఇద్దరు యువకులు నిన్న ఉదయం 10 గంటల సమయంలో నానాజీ వాగులో ఈతకు దిగారు. ప్రవాహం ఎక్కువగా ఉండడం, ఈత రాకపోవడంతో యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. సమాచారం అందడంతో గత ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. గాలింపులో భాగంగా రెండు మృతదేహాలు లభ్యం కాగా.. వాటిని బయటకు తీశారు. ఘటనా స్థలంలో మొబైల్ ఫోన్లు, బట్టలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details