child died: నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి - telangana varthalu
14:40 September 11
నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి
అప్పటివరకు కళ్లముందే బుడి బుడి అడుగులతో తిరిగిన చిన్నారి అడుగులు ఆగిపోయాయి. చిలిపి చేష్టలతో తల్లిదండ్రుల కష్టాలను మరచిపోయేలా చేసే ఆ అల్లరి మూగబోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేదని తెలుసుకున్న అమ్మనాన్నలు శోకసంద్రంలో మునిగిపోయారు. నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోని సుధీర్‌కుమార్ కాలనీలో జరిగింది.
ఆడుకుంటూ వెళ్లి చిన్నారి నిత్య(2) నీటి సంపులో పడిపోయింది. నీటి సంపులో పడిన గంట తర్వాత తమ కూతురి కోసం తల్లిదండ్రులు వెతకగా... నీటి సంపులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. తమ కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు రోధించిన తీరు స్థానికులను కలచివేసింది.
ఇదీ చదవండి: యువకుడి వేధింపులు తాళలేక... 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య