తెలంగాణ

telangana

ETV Bharat / crime

కేటీకే ఆరో గనిలో ప్రమాదం... ఇద్దరు కార్మికులు దుర్మరణం - కేటీకే ఆరో గనిలో ప్రమాదం

singareni
singareni

By

Published : Apr 7, 2021, 7:28 PM IST

Updated : Apr 7, 2021, 8:47 PM IST

19:26 April 07

కేటీకే ఆరో గనిలో ప్రమాదం... ఇద్దరు కార్మికులు దుర్మరణం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేటీకే 6వ ఇంక్లైన్​లో ప్రమాదం చోటుచేసుకుంది. గని పైకప్పు కూలి... ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న సింగరేణి రెస్కూ సిబ్బంది... బండ తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. గనిలో సపోర్ట్ మెన్​గా పనిచేస్తున్న శంకరయ్య, నర్సయ్య... ఈ మధ్యాహ్నం విధుల్లో చేరారు.  

సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గనిపైభాగం కూలింది. దీంతో బొగ్గుపెళ్లల బండల కింద వారిద్దరూ చిక్కుకుపోయారు. సింగరేణి ఉన్నతాధికారులు గనివద్దకు చేరుకుని... పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దుర్ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సింగరేణి అధికారులతో మాట్లాడారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. ప్రభుత్వపరంగా ఆ కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.  

Last Updated : Apr 7, 2021, 8:47 PM IST

ABOUT THE AUTHOR

...view details