మేడ్చల్ జిల్లా కొంపల్లిలో ఓ భవన నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. భవనం నిర్మాణానికి సంబంధించి ఇనుపచువ్వలు తీసుకెళ్లిన భారీ ట్రక్ బోల్తాపడి ఓ కార్మికుడు మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
ట్రాలీ బోల్తా పడి కార్మికుని మృతి, ఒకరి పరిస్థితి విషమం - తెలంగాణ నేర వార్తలు
ట్రాలీ బోల్తా పడి కార్మికుడు మృతి చెందిన ఘటన... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ నిర్మాణం కోసం ఇనుప చువ్వలు తీసుకొచ్చిన ట్రాలీ ప్రమాదానికి గురైంది.
ట్రాలీ బోల్తా పడి కార్మికుని మృతి, ఒకరి పరిస్థితి విషమం
అపార్ట్‌మెంట్ సెల్లార్ నిర్మాణానికి ట్రక్‌లో ఇనుపచువ్వలు తీసుకొచ్చారు. ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి గుంతలో పడింది. అక్కడే ఉన్న ఇద్దరు కార్మికులపై పడటంతో అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు.... ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.
Last Updated : Feb 23, 2021, 4:19 PM IST