ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో వరి చేనులో వరి నూర్పిడి యంత్రం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మిషన్పై కూర్చున్న కనిమెట్ట గ్రామానికి చెందిన అన్నపు భారతి, పైడి సత్యవతి అక్కడికక్కడే మృతి చెందారు.
అదుపుతప్పిన వరి నూర్పిడి యంత్రం.. ఇద్దరు మహిళలు మృతి - srikakulam district crime news
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు వరి నూర్పిడి యంత్రం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో యంత్రంపై కూర్చున్న ఇద్దరు మహిళలు మృతి చెందారు.

అదుపుతప్పిన వరి నూర్పిడి యంత్రం.. ఇద్దరు మహిళలు మృతి
భారతి భర్త ఇటీవలే క్యాన్సర్తో మృతిచెందగా.. ఆమె ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. సత్యవతికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై పొందూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:'భార్యాభర్తల మధ్య గొడవ... చిన్నారుల హత్య'