ఏపీలోని కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం డి.నేలటూరులో అంజనమ్మ, లక్ష్మీదేవి అనే ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. పాత కక్షలతో హత్యలు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. వరకట్న వేధింపులతో అంజనమ్మ కోడలు చరిష్మా 2019లో హత్యకు గురైంది. అప్పట్లో చరిష్మా తల్లిదండ్రులు.. అంజనమ్మ, ఆమె కుమార్తె లక్ష్మీదేవిపై కేసు పెట్టారు. అత్తింట్లోనే చరిష్మా మృతదేహాన్ని సమాధి కట్టించారు. అయితే హత్య కేసులో బెయిల్ రావడంతో అంజనమ్మ, లక్ష్మీదేవి.. తిరిగి గ్రామానికి వెళ్లలేక బ్రహ్మంగారిమఠంలో నివాసముంటున్నారు.
Murder: ఇద్దరు మహిళల దారుణ హత్య.. పాతకక్షలేనా..! - కడప జిల్లా నేర వార్తలు
ఏపీలోని కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారు. కోడలిని చంపిందన్న కేసులో అరెస్టయి... బెయిల్‌పై వచ్చిన తల్లీకూతుళ్లు హత్యకు గురవటంపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నేలటూరులో ఉంటున్న తన తల్లిని చూసేందుకు అంజనమ్మ, కుమార్తె లక్ష్మీదేవి.. మనవడుతో కలిసి గ్రామానికి వెళ్లింది. సమాచారం తెలుసుకున్న ప్రత్యర్థులు తల్లీకూతుళ్లను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రతీకార చర్యలో భాగంగానే హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. చరిష్మా సమాధి వద్దనే హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న డీఎస్పీ బి.విజయ్‌కుమార్, సీఐ బీవీచలపతి, ఎస్సై శ్రీనివాసులు గ్రామానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇవీ చూడండి: