Two women and three children are missing: హైదరాబాద్లోని కులుసుంపుర పోలీసు స్టేషన్ పరిధిలో మహిళల అదృశ్యం కేసు కలకలం రేపుతోంది. జియాగూడ దుర్గానగర్ బస్తీలో పక్క పక్క ఇంటిలో ఉండే ఆర్తి, అశ్విని వారి పిల్లలు ముగ్గరు కనిపించడం లేదని వారి భర్తలు కులుసుంపుర పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
కులుసుంపురలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలు అదృశ్యం.. - Women are missing in Jiyaguda Durganagar
Two women and three children are missing: హైదరాబాద్లోని కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో పక్కపక్క ఇంటిలో ఉంటున్న ఇద్దరు మహిళలు వారి ముగ్గురు పిల్లల అదృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. దీనిపై మహిళల భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు సీసీ పుటేజ్లను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
missing case in Kulusumpura
దగ్గర్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు మహిళలు వారి పిల్లలతో ఓ కారులో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కారు తీసుకొచ్చిన వ్యక్తి సదరు మహిళలకు తెలిసిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు విచారణలో దశలో ఉన్న కారణంగా పోలీసులు పూర్తి వివరాలు చెప్పడం లేదు.
ఇవీ చదవండి: