తెలంగాణ

telangana

ETV Bharat / crime

రోడ్డుప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి - ఏపీ వార్తలు

ఏపీలోని కడపజిల్లా పులివెందుల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జీపు, కారు, మున్సిపాలిటీ ట్రాక్టర్ ఒకదానికొకటి ఢీకొని ఇద్దరు మహిళా రైతు కూలీలు మృతిచెందారు. ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

ఏపీ వార్తలు, పులివెందు ప్రమాదం
kaddapah accident, pulivendula accident, ap news

By

Published : Mar 31, 2021, 9:43 AM IST

జీపు, కారు, మున్సిపాలిటీ ట్రాక్టర్ ఒకదానికొకటి ఢీకొని ఇద్దరు మహిళా రైతు కూలీలు మృతి చెందిన ఘటన ఏపీలోని కడప జిల్లా పులివెందులలో జరిగింది. తెల్లవారుజామునే కూలికి వెళ్లేందుకు జీపులో బయలుదేరిన మహిళలను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. కొత్తపల్లికి చెందిన మహిళలు పని కోసం జీపులో వెళ్తుండగా... పులివెందులలోని ఎంవీఐ కార్యాలయం వద్దకు రాగానే... ఎదురుగా వస్తున్న కారు.. జీపును ఢీకొట్టింది. పక్కనే మున్సిపాలిటీ ట్రాక్టర్ కూడా ఉండడంతో దాన్ని కూడా ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా రైతు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రగాయాల పాలయ్యారు.

క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్​కు తరలించారు. పారిశుద్ధ్య పనులు చేయడానికి వెళ్తున్న కార్మికులకు, కూలీ పనులకు వెళ్తున్న మహిళా రైతు కూలీలకు రోడ్డు ప్రమాదం జరగడంతో స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పులివెందులలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి

ఇదీ చూడండి:విధి నిర్వహణలో గాయపడిన ఏఎస్సై మహిపాల్​రెడ్డి మృతి

ABOUT THE AUTHOR

...view details