హైదరాబాద్ ఎర్రగడ్డలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కింద అర్ధరాత్రి సమయంలో.. ఇటుకల లారీ ద్విచక్రవాహనాన్ని(Lorry hits a Bike in Hyderabad) ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి చెందారు. మూసాపేట నుంచి ఎర్రగడ్డకు వెళ్తున్న సమయంలో ప్రమాదం(Lorry hits a Bike in Hyderabad) జరిగినట్లు తెలుస్తోంది.
Lorry hits a Bike in Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి - హైదరాబాద్లో బైక్ను ఢీకొట్టిన లారీ
స్నేహితుడు తన సొంతూరుకు వెళ్తుంటే రైల్వే స్టేషన్లో దింపుతానని అతడితో పాటూ తనూ బయల్దేరాడు. ద్విచక్రవాహనంపై పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో ఎదురుగా ఓ ఇటుకల లారీ(Lorry hits a Bike in Hyderabad).. తప్పించుకుందామని ఆలోచించే లోపే వచ్చి ఢీకొట్టింది. ఏమవుతుందో అర్థమయ్యేలోగానే ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిశాయి.
Lorry hits a Bike in Hyderabad
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు త్రిపురకు చెందిన యువకులు సుమన్(24), బప్పి (22)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
సుమన్ సొంతూరు వెళ్లడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వెళ్తుంటే.. అతణ్ని స్టేషన్లో దింపడానికి బప్పి వెళ్లాడు. ఈక్రమంలో ప్రమాదం(Lorry hits a Bike in Hyderabad) జరగడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.