Chain Robbery: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో.. గొలుసు చోరీకి దొంగలు యత్నించారు. నిన్న రాత్రి ఓ మహిళ తన కుమారుడిని బస్ స్టాండ్‌కు పంపించేందుకు.. ఆటోలో వెళ్లింది. అక్కడి నుంచి ఇంటికి రోడ్డుపై తిరిగొస్తుండగా.. దారిలో ఇద్దరు దొంగలు ఆమె మెడలో గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన ఆ మహిళ గొలుసు గట్టిగా పట్టుకుని కేకలు వేసింది. అనంతరం చుట్టు పక్కల ఉన్నవారు అక్కడికి చేరుకొని ఆ ఇద్దరు దొంగలలో ఒక దొంగను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం బాలాజీనగర్ పోలీసులకు అప్పగించారు. మరో దొంగ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగ కోసం గాలిస్తున్నారు. ఈ ఇద్దరి నిందితులు నెల్లూరు సరస్వతినగర్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్లు చందు, సురేశ్లుగా పోలీసులు గుర్తించారు.
CHAIN CHORY: దొంగలించబోయి.. చిక్కుకున్న చైన్ స్నాచర్! - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
Chain Robbery: ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లేందుకు ఇద్దరు దుండగులు యత్నించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన మహిళ వారిపై తిరగబడింది. ఈ సంఘటన ఏపీలోని నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో జరిగింది.
చైన్ దొంగలు