నగరంలోని ఇళ్లల్లో రాత్రివేళ దొంగతనాలకు పాల్పడుతోన్న ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు హైదరాబాద్ మల్లాపూర్‌కు చెందిన చందన్, శంకరయ్యలుగా గుర్తించారు. వారి వద్ద నుంచి భారీగా బంగారు, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు.
దొంగతనాలకు పాల్పడుతోన్న ఇద్దరి అరెస్ట్ - dcp rakshitha latest news
నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతోన్న ఇద్దరు నిందితులకు పోలీసులు చెక్ పెట్టారు. బోడుప్పల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నారు. అపహరించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

దొంగతనాలకు పాల్పడుతోన్న ఇద్దరి అరెస్ట్
నిందితులు ఇదివరకే జవహర్‌నగర్, తూప్రాన్, బోయిన్పల్లి పరిధిలో దొంగతనాల కేసుల్లో జైలుకి వెళ్లొచ్చినట్లు మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి తెలిపారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 3, నాచారం పీఎస్ పరిధిలో ఒకటి చొప్పున దొంగతనాలు చేసినట్లు పేర్కొన్నారు. బోడుప్పల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. మేడిపల్లి క్రైమ్ పోలీసులు పట్టుకున్నారని వివరించారు.
ఇదీచూడండి: జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై కౌంటర్ దాఖలు