ముషీరాబాద్ మెయిన్రోడ్లో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి... బండరాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి.
గంజాయి మత్తులో ఇద్దరు యువకులు పరస్పరం దాడి - ganajai news
ఇద్దరు యువకులు గంజాయి మత్తులో ఒకరిపై ఒకరు బండరాళ్లతో దాడి చేసుకున్నారు. తీవ్రగాయాలపాలైన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన చిక్కడపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
గంజాయి మత్తులో ఇద్దరు యువకులు పరస్పరం దాడి
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన యువకులను ఆస్పత్రికి తరలించారు. యువకుల గురించి దర్యాప్తు చేస్తున్నట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:వాహనాలను ఢీ కొట్టిన రైలు- ఐదుగురు మృతి