తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... యువతి మృతి! - తెలంగాణ వార్తలు

two-suicide-attempts-in-nizamabad-district
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... యువతి మృతి!

By

Published : Mar 17, 2021, 10:35 AM IST

Updated : Mar 17, 2021, 11:55 AM IST

10:33 March 17

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... యువతి మృతి!

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... యువతి మృతి!

     నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సిరికొండ మండలం చీమన్‌పల్లి శివారులో రెండు రోజుల క్రితం కలుసుకున్న ప్రేమికులు... మనోవేదనతో బలవన్మరణానికి యత్నించారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి యువతి మృతి చెందింది.  

    సిరికొండ మండలం పందిమడుగు గ్రామానికి చెందిన వందన, చింతల్ తండాకు చెందిన సుభాష్ కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. సుభాష్​కు వేరే యువతితో డిసెంబరులో  వివాహమైంది. తనను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడని యువతి నిలదీసింది. అనంతరం ఇద్దరు కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.  

ఇదీ చదవండి:'అందంగా లేవు... అదనపు కట్నం కావాలి...' ఓ వివాహిత బలి!

Last Updated : Mar 17, 2021, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details