మనువాడిన వారిని ఆ ఇద్దరూ పట్టించుకోలేదు. పిల్లలున్నా లెక్కచేయలేదు. వివాహేతర సంబంధానికి ఆకర్షితులై ఆ బంధాన్ని అలాగే కొనసాగించారు. పెద్దలకు తెలిసి మందలించినా తీరు మార్చుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పాకాలపాడుకు చెందిన సంగేపు గోపి(30)కి వెనిగండ్లకు చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. వారికి ఓ బాబు ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం వారు వెనిగండ్లకు వచ్చి స్థిరపడ్డారు. గుంటూరు శివారు ఆటోనగర్‌లోని ఓ ఫర్నిచర్ దుకాణంలో అతను డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అదే గ్రామంలో నివసించే ఓ వివాహిత, గోపి మధ్య ఏడేళ్ల క్రితం వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. రెండేళ్ల క్రితం విషయం తెలిసిన పెద్ద మనుషులు ఈ ఇద్దరినీ మందలించారు. ఆ సమయంలో తీవ్ర మనస్తాపం చెందిన వివాహిత భర్త జూటూరి గోపి ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత కూడా వీరి సంబంధం కొనసాగడంతో రెండు కుటుంబాల్లోనూ సమస్యలు ఎదురయ్యాయి. దీనికి పరిష్కారం చావేనని ఇద్దరూ భావించారు.
మందలించినా మానలేదు.. మనువాడిన మనిషిని వదిలేసి.. మరొకరితో.! - Attempted suicide by being attracted to an extramarital affair
అతనికి వివాహమై ఓ బాబు ఉన్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. అయినా ఒకరికొకరు ఆకర్షితులై వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. పెద్దలు మందలించినా లెక్కచేయలేదు. అయితే వేర్వేరు కుటుంబాలు, కలిసి ఉండలేని పరిస్థితి.. ఈ వ్యధతో వారు చివరికి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రియుడు మృతి చెందాడు. ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఏపీలోని గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్లలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
నాలుగు రోజుల క్రితం సంగేపు గోపి ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయాడు. రెండు రోజుల అనంతరం కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా కారు డ్రైవింగ్ నిమిత్తం వెళ్లానని, త్వరగా వచ్చేస్తానని చెప్పాడు. అదే రోజు నుంచి వివాహిత కూడా కనిపించకుండా పోయింది. శనివారం రాత్రి కుటుంబ సభ్యులు మళ్లీ అతనికి ఫోన్ చేయగా.. తనతో పాటు ఆమె కూడా ఉందని, తామిద్దరం స్థానిక సాయిబాబా ఆలయం ఎదుట ఉన్న పొలాల్లో పురుగుల మందు సేవించామని తెలియజేశారు. వెంటనే అతని బంధువులు ఘటనా స్థలానికి వెళ్లగా.. వాంతులు చేసుకుంటూ ఇద్దరూ కనిపించారు. వెంటనే వారిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే గోపి మృతిచెందాడు. వివాహిత పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు.
ఇదీ చదవండి:MURDER ATTEMPT: కుమార్తెపై తండ్రి కత్తితో దాడి.. కారణమేంటంటే..?