వారిద్దరికీ వేర్వేరు పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలూ ఉన్నారు. కానీ.. వారి పరిచయం హద్దులు దాటింది. వివాహేతర సంబంధానికి దారితీసింది. కఠిన నిర్ణయం తీసుకున్నారు.. కట్టుదాటారు! కలిసి బతుకుదామని మూడు నెలల క్రితం ఊరు విడిచివెళ్లారు. అయితే.. తాజాగా ఊహించని వార్త. వారిద్దరూ మృతిచెందారు! పలు అనుమానాలకు తావిస్తున్న ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
కోటబొమ్మాళి మండలం గంగరాం గ్రామ సమీపంలో రైల్వేలైనుపై శుక్రవారం ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. వీరు జలుమూరు మండలానికి చెందిన కుంచి శంకరరావు(40), వెలమల యశోద(32)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరికీ వేర్వేరుగా వివాహాలు జరగ్గా.. ఇద్దరికీ పిల్లలు ఉన్నారు.