షార్ట్ సర్క్యూట్‌తో రెండు దుకాణాలు దగ్ధం
కోదాడలోని రెండు దుకాణాల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 7 లక్షల నష్టం వాటిల్లందని అంచనా వేశారు. ఈ ప్రమదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని తేలింది.
Short circuit
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో షాట్ సర్క్యూట్ కారణంగా రెండు దుకాణాలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. తెల్లవారు జామున దుకాణం నుంచి మంటలు రావడంతో స్థానికులు అగ్ని ప్రమాద సిబ్బందికి సమాచారం అందించారు. రెండు దుకాణాలు పక్కపక్కనే ఉండటం వల్ల ఏడు లక్షల వరకు నష్టం వాటిల్లింది. అప్పులు చేసి దుకాణాలను నడిపిస్తున్నామని బాధితులు వెల్లడించారు. అగ్నిప్రమాదంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.