ఏపీలోని శేషాచల అడవుల్లో అటవీశాఖ అధికారులు బుధవారం కూంబింగ్ నిర్వహించారు. తలకోన సెంట్రల్ బీట్‌లోని ఎలమ చెట్లదడి వద్ద వారిని గుర్తించిన ఎర్రచందనం స్మగ్లర్లు.. దుంగలు పడవేసి దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. పరిసర ప్రాంతాల్లో గాలింపులు చేపట్టిన అధికారులు ఇద్దరు స్థానిక స్మగ్లర్ల అరెస్ట్ చేశారు.
శేషాచల అడవుల్లో పోలీసుల కూంబింగ్.. ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్ - today Two smugglers arrested at shesachala forest news update
ఏపీ చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లోని తలకోన అడవుల్లో అటవీ శాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించి.. ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు జిల్లా, చిత్తూరులో ఎర్రచందనం, ఎర్రచందనం స్మగ్లింగ్
వారి నుంచి 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పరారైన స్మగ్లర్ల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. పట్టుబడ్డ వారిని సోమల మండలానికి చెందిన చిన్న మల్లయ్య, యర్రావారిపాళ్యం మండలానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డిగా గుర్తించారు.