గ్రామస్థులను కాపాడేందుకు వచ్చి.. వాగులో గల్లంతైన రెస్క్యూ టీమ్ - telangana floods
18:28 July 13
గ్రామస్థుల తరలింపునకు వెళ్తుండగా పెద్దవాగులో గల్లంతైన ఇద్దరు సిబ్బంది
Rescue team drowned: వరదల్లో చిక్కుకున్న గ్రామస్థులను కాపాడంటం కోసం వచ్చి.. రెస్క్యూ సిబ్బందే వాగులో ఘల్లంతైన విషాదకర ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం పెసరకుంటలో చోటుచేసుకుంది. వరదలు ముంచెత్తడంతో దహేగాం మండలం మొత్తం జలదిగ్బంధమైంది. మండలంలోని పెసరకుంట గ్రామస్థులు పాఠశాలలో తలదాచుకున్నారు. సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనప్ప గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. సహాయ చర్యల కోసం సింగరేణి రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. గ్రామస్థుల తరలింపు కోసం వెళ్తుండగా.. రెస్క్యూ టీంలోని ఇద్దరు ప్రమాదవశాత్తు పెద్దవాగులో గల్లంతయ్యారు.
ఇవీ చూడండి: