భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో(ROAD ACCIDENT) ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు లోడుతో వెళ్తున్న టిప్పర్ని ఇటుకలతో వస్తున్న డీసీఎం వ్యాన్ అదుపుతప్పి వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ములుగు జిల్లా వాజేడు మండలం చిన్న గొల్లగూడెం గ్రామానికి చెందిన లాలయ్య, డర్రా నరసింహారావు మృతి చెందారు. డ్రైవర్ కృష్ణ తీవ్ర గాయాలతో భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ROAD ACCIDENT: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి - latest road accdient
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. బొగ్గు లోడుతో వెళ్తున్న టిప్పర్ని ఇటుకలతో వస్తున్న డీసీఎం వ్యాన్ అదుపుతప్పి వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
![ROAD ACCIDENT: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి Two persons were killed and a driver was seriously injured in a road accident at Ramanujavaram village in Manuguru zone of Bhadradri Kothagudem district.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12306713-104-12306713-1625016034622.jpg)
ROAD ACCIDENT: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న ముగ్గురు వ్యక్తులను.. మణుగూరు ఎస్సై నరేశ్ తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడేందుకు ఎస్సై ప్రయత్నించినప్పటికీ వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఇదీ చూడండి: PRAGATHI: రేపట్నుంచే పది రోజుల పాటు పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు