మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పరిధిలో ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అయ్యగారిపల్లికి చెందిన వడ్లకొండ రాము(20), కొర్లి నరేందర్(20) అనే ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై కురవికి వెళ్తున్నారు. అయ్యగారిపల్లి శివారులోని పెట్రోల్ బంక్లోపలి నుంచి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.
ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఢీ.. ఇద్దరు యువకులు మృతి - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు
ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఢీ కొని ఇద్దరు మృతి చెందిన ఘటన... మహబూబాబాద్ జిల్లా కురవి మండల పరిధిలో చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు ట్రాక్టర్ యజమాని ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని... ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాము, నరేందర్లను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మృతి చెందినట్లు తెలిపారు. తమకు న్యాయ చేయాలంటూ బాధిత కుటుంబసభ్యులు ట్రాక్టర్ యజమాని ఇంటిముందు ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:దారుణం: యువతిపై 25మంది అత్యాచారం