తెలంగాణ

telangana

ETV Bharat / crime

two persons died in water: సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ఇద్దరు జల సమాధి - అమీన్‌పూర్‌ మండలంలో ఇద్దరు మృతి

two persons died in water: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన ఘటనల్లో ఇద్దరు జలసమాధి అయ్యారు. మృతులు అమీన్‌పూర్‌ మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

two persons died in water
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలంలో వేర్వేరు చోట్ల ఇద్దరు జల సమాధి

By

Published : Feb 5, 2022, 1:28 PM IST

two persons died in water: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలంలో వేర్వేరు చోట్ల ఇద్దరు జల సమాధి అయ్యారు. మండలంలోని కిష్టారెడ్డిపేట శివారు గుంతలో మల్లి అనే వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు మల్లి ఇటుకల బట్టిలో పనిచేసే కూలీగా నిర్ధారించారు.

ఇంట్లో గొడవపడి విగతజీవిగా..

Vadakpalli: అమీన్‌పూర్‌ మండలంలోని వడక్‌పల్లికి చెందిన శ్రీనివాస్ విగతజీవిగా మారాడు. గ్రామ సమీపంలోని నల్లచెరువులో శ్రీనివాస్ మృతదేహాన్ని గుర్తించారు. నిన్న ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లిన శ్రీనివాస్ మృతి చెందడంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రెండు ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details