road accident kompally: మేడ్చల్ జిల్లా కొంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున తుప్రాన్ నుంచి గుడిమల్కాపూర్ పూల మార్కెట్కు వెళ్తున్న కారు కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీ కొట్టింది.
Road accident in Kompally: తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - తెలంగాణ తాజా నేర వార్తలు
road accident kompally: తెల్లవారుజామున మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనాన్ని కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదంలో తుక్కతుకైన కారు
ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తుక్కుతుక్కు కావడంతో కారు నడుపుతున్న షకీర్(30), పక్కన్న ఉన్న అఫ్సర్(55) అక్కడికక్కడే మృతి చెందారు. బాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Petrol Tanker Blast at Suryapet: బస్టాండ్ వద్ద పేలిన పెట్రోల్ ట్యాంకర్.. ఇద్దరు మృతి