ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం జలాశయంలో సోమవారం సాయంత్రం యువతీ యువకుడు మృతి చెందారు. పస్రా ఎస్సై సీహెచ్.కరుణాకర్‌రావు కథనం ప్రకారం... హైదరాబాద్‌లోని ఐసీఎఫ్‌ఏఐ(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ ఫైనాన్సియల్ ఎనలిస్ట్ప్ ఆఫ్ ఇండియా) విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుతున్న ముగ్గురు యువతులు, ముగ్గురు యువకులు ఆన్‌లైన్‌లో వసతి బుక్ చేసుకొని సోమవారం సాయంత్రం లక్నవరం జలాశయం వద్దకు వచ్చారు.
కన్నోళ్లకు కన్నీటిని మిగిల్చిన... యువతీయువకుల విహార యాత్ర... - సరస్సులో గల్లంతై యువతీయువకుడు మృతి
పర్యాటక ప్రాంతమైన లక్నవరం జలాశయం వద్ద విషాదం చోటుచేసుకుంది. సోమవారం విహారయాత్రకు వచ్చి సరదాగా సరస్సులోకి దిగి ప్రమాదవశాత్తు యువతీయువకుడు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. జాలర్లు జలాశయంలో మూడు గంటల పాటు శ్రమించి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.
గదుల్లో లగేజీ పెట్టే బోట్‌పై రెండో ఐలాండ్‌కు చేరుకున్నారు. సరదాగా స్వీయ చిత్రాలు దిగారు. తర్వాత ఆరుగురు నీళ్లలోకి దిగారు. ఆరెంపల్లి తరుణి(20), సాయి ప్రీతమ్(20) నీటిలో పడిపోాయరు. బయటపడేందుకు విశ్వప్రయత్నం చేసినప్పటికీ విధి వారిని చిన్నచూపు చూసింది. స్నేహితులు చూస్తుండగానే నీటిలో మునిగిపోయారు. వారి అరుపులు అరణ్యరోదనలయ్యాయి. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. జాలర్లు జలాశయంలో మూడు గంటల పాటు శ్రమించి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.
ఇవీ చదవండి:Kondapur case: కుటుంబ నేర కథాచిత్రమ్.. అత్యాచారయత్నం కేసులో కొత్త కోణం