మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణం చేస్తుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. పట్టణంలోని కన్నాల బస్తీలో గృహ నిర్మాణం చేసే సమయంలో ప్రమాదవశాత్తు జరిగిన విద్యుదాఘాతంతో ఇంటి యజమాని, కూలీ మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు.
బెల్లంపల్లిలో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
బెల్లంపల్లిలో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
11 కేవీ విద్యుత్ లైన్‌పై ఇనుప పైపులు పడటంతో సమీపంలో ఇంటి యజమాని సముద్రం, కూలీ వెంకటేష్ అక్కడే ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన మల్లేష్‌ను బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించారు.
ఇదీ చదవండి:వ్యక్తి అనుమానాస్పద మృతి.. భార్య, మేనల్లుడిపై అనుమానం