తెలంగాణ

telangana

ETV Bharat / crime

Road Accident: కల్వర్టును ఢీకొన్న కారు.. మామ, కోడలు మృతి - కోవూరు రోడ్డు ప్రమాదం

ఐదో తరగతి చదువుతున్న కుమారుడిని వసతి గృహంలో చేర్పించేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఏపీలోని నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడి తాతయ్య, అమ్మ మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

accident
accident

By

Published : Sep 14, 2021, 12:10 PM IST

ఏపీలోని నెల్లూరు జిల్లా కోవూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని నెల్లూరు వైద్యశాలకు తరలించారు.

నెల్లూరు హరినాథపురానికి చెందిన ఓ కుటుంబం.. ఐదో తరగతి చదివే తమ కుమారుడిని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్న హాస్టల్‌లో చేర్పించేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోవూరు ఏసీసీ కల్యాణ మండపం వద్దకు రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనతో కారులో ఉన్న విద్యార్ధి తాత, పార్లపల్లి సుధాకర్‌రావు(76), అమ్మ అపర్ణ(30) అక్కడికక్కడే మృతిచెందారు.

కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి :tractor overturned: ట్రాక్టర్​లో ఇసుకను అన్​లోడ్​ చేసి వెళ్తున్నారు.. అంతలోనే..

ABOUT THE AUTHOR

...view details