రంగారెడ్డి జిల్లా యాచారం సమీపంలోని నాగార్జున సాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బోలెరో వాహనం ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ద్విచక్రవాహనాలను ఢీకొట్టిన బొలెరో వాహనం.. ఇద్దరు మృతి - Rangareddy district latest news
రెండు ద్విచక్రవాహనాలను బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన... రంగారెడ్డి జిల్లా యాచారం సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి, రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల్లో ఒకరు యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్(19)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి: మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ తొలగింపు