తెలంగాణ

telangana

ETV Bharat / crime

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ఇద్దరు మృతి - మంచిర్యాల జిల్లా తాజా వార్తలు

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టగా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

two persons dead in road accident at mancherial district
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ఇద్దరు మృతి

By

Published : Jan 23, 2021, 8:51 PM IST

ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన... మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రయిపేట సమీపంలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని సిరోంచకు చెందిన వెంకటేశ్​, పెద్దపల్లి జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన కేశవులు ద్విచక్రవాహనంపై చెన్నూరుకు వెళ్తున్నారు.

ఆ సమయంలో వారికి ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు కోటపల్లి పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: మోదీ సారథ్యంలో వ్యవసాయం పండగే: కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details