హైదరాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 58 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్ వినాయకనగర్‌కు చెందిన పసుపులేటి శ్రీకాంత్(28), జీడిమెట్ల చంద్రగిరి కాలనీలో నివాసముండే చిపిరి ఎల్లేష్(28)లు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్ - ఇద్దరు యువకుల అరెస్ట్
నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 58 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించారు.
![గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్ Two persons arrested for selling marijuana in miyapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11588059-30-11588059-1619755576617.jpg)
మియాపూర్‌లో గంజాయి విక్రేతల అరెస్ట్
గురువారం మియాపూర్ నుంచి బొల్లారం వెళ్లే రోడ్డులో ప్రజయ్ షెల్టర్ కమాన్ వద్ద విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.