తెలంగాణ

telangana

ETV Bharat / crime

Washed Away: నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతు - People washed away in Godavari river

Washed Away: సరదాగా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు.

Washed Away
Washed Away

By

Published : Dec 26, 2021, 6:11 PM IST

Updated : Dec 26, 2021, 8:13 PM IST

Washed Away: సరదా కోసం ఈతకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పాత మణుగూరు గ్రామానికి చెందిన కేత మణికుమార్(24), రామానుజవరం గ్రామానికి చెందిన ఆకుల సందీప్(22), జితేందర్, నాగ కిరణ్‌లతో కలిసి కొండగూడెం వైద్యనాథ లింగేశ్వర స్వామి ఆలయ పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లారు.

వీరిలో సందీప్, మణికుమార్‌లో గోదావరి నది ప్రవాహాన్ని తెలుసుకోలేక ముందుకు సాగి గల్లంతయ్యారు. వీరిని గమనించిన జాలర్లు రక్షించేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది.

సమాచారం తెలుసుకున్న మణుగూరు సీఐ ముత్యం రమేశ్ ఘటనా స్థలానికి చేరుకొని జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో సందీప్ మృతదేహం లభ్యమైంది. మణికుమార్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. చీకటిపడటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. సోమవారం మళ్లీ గాలింపు చేపట్టనున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Dec 26, 2021, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details