వ్యవసాయ బావిలో పడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా మల్కాపూర్‌లో చోటుచేసుకుంది. మహిపాల్, కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ఓ వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు బావిలో దూకారు.
వ్యవసాయ బావిలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి - Two people fell in well
వేసవి తాపం తీర్చుకునేందుకు వ్యవసాయ బావిలోకి దిగి ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా మల్కాపూర్‌లో జరిగింది. వీరిలో ఒకరి మృతదేహం లభించగా మరొకరిది లభించాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కృష్ణకు మాత్రమే ఈత రాగా... మహిపాల్‌కు ఈత రాదు. మహిపాల్ శవం తేలగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నీటిలో తేలిన శవాన్ని బయటకు తీసి మరో మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. గట్టు మీద ఉన్న బట్టల ఆధారంగా మృతులను గుర్తించారు.
కాగా.. ఈత వచ్చిన కృష్ణ చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతులు మహిపాల్‌కు భార్య లక్ష్మి, మూడేళ్ల కూతురు భాగ్యశ్రీ, ఐదేళ్ల కుమారుడు అవినాశ్ ఉన్నారు. మరో మృతుడు కృష్ణకు భార్య రేణుక, ఆరు నెలల పాప ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు.