ఫొటోల సరదా ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన దుర్ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ సైదాబాద్ ప్రాంతానికి చెందిన శ్రీరాం, ప్రవీణ్, శ్రీకాంత్, రోహన్, నాని ఐదుగురు యువకులు చౌటుప్పల్‌కు వెళ్లి తాటికల్లు తాగారు.
ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన ఫొటో సరదా! - చెరువులో ఇద్దరు యువకులు గల్లంతు
ఫొటో సరదా ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని లక్కారం శివారులో గల చెరువులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన ఫొటో సరదా!
అనంతరం లక్కారం శివారులోని చెరువులో ఫొటోలు దిగడానికి రోహన్, నాని ఇద్దరు దిగారు. ప్రమాదవశాత్తు ఈత రాకపోవడం వల్ల చెరువులో మునిగి చనిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకున్నారు. పోలీసులు, మత్స్య కార్మికులు 2 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు.
ఇదీ చదవండి:'నేను చనిపోతే దానికి కారణం ఎస్సై, సీఐ'
Last Updated : Apr 25, 2021, 9:11 PM IST