మిర్యాలగూడ పట్టణం చైతన్యనగర్ రోడ్ నెంబర్ 10 లో భూగర్భ డ్రైనేజీ కాలువలో పడి.. విషవాయువులు పీల్చి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు యాద్గార్పల్లి గ్రామానికి చెందిన కుంచెం శ్రీనివాస్, దొండవారి గూడేనికి చెందిన సూపర్వైజర్ పాశం సంతోశ్ రెడ్డిగా గుర్తించారు.
కుంచెం శ్రీను అనే బాలుడు డ్రైనేజీలోకి దిగి పనిచేస్తుండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. అతనిని కాపాడడానికి సూపర్వైజర్ సంతోశ్ రెడ్డి, మరోవ్యక్తి కుంచెం శ్రీనివాసులు ప్రయత్నించి బాలుడిని పైకి లాగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరు డ్రైనేజీలో పడిపోయారు. విషవాయువుల వల్ల ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.