తెలంగాణ

telangana

ETV Bharat / crime

పెళ్లి చీరలు తీసుకెళ్తూ.. అనంతలోకాలకు వెళ్లారు - Telangana News Updates

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం పైనుంచి పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

bike accident
bike accident

By

Published : Apr 26, 2021, 4:25 PM IST

సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో అదుపుతప్పి ద్విచక్రవాహనం పైనుంచి పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాము, నగేశ్​గా పోలీసులు గుర్తించారు. ఇరువురు హైదరాబాద్​లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు.

బంధువుల పెళ్లి కోసం హైదరాబాద్​లో చీరలు కొని శ్రీకాకుళంకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. మునగాల వద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపు తప్పింది. ఇరువురు రాళ్ల మీద పడి అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:పార్కింగ్ స్థలంలోనే కరోనా మృతదేహాల దహనం

ABOUT THE AUTHOR

...view details