accident at vishaka: ఏపీలోని విశాఖ జిల్లా ఎలమంచిలి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
accident: విశాఖలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..! - విశాఖలో రోడ్డు ప్రమాదం
accident at vishaka: ఏపీలోని విశాఖ జిల్లా ఎలమంచిలి వద్ద బొలెరో వాహనం, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
గోపాలపట్నం గ్రామానికి చెందిన సూరిబాబు, నాని.. కొబ్బరికాయలు వ్యాపారం చేస్తూ జీవనోపాధి సాగిస్తుంటారు. బొలెరో వ్యాన్లో కొబ్బరికాయలను విశాఖకు తరలిస్తుండగా రహదారి పక్కన ఉన్న లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎలమంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన ఇద్దరు వ్యక్తులు పేద కుటుంబాలకు చెందిన వారు కావడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చూడండి:Deers skeletons: కలకలం సృష్టిస్తున్న జింకల కళేబరాలు... ఎక్కడంటే