రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎం, కారును మరో డీసీఎం వ్యాను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులు హనుమంతరావు, రామచంద్రయ్యలు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం జిల్లా వాసులుగా గుర్తించారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు.
డీసీఎం బీభత్సం .. ఇద్దరు దుర్మరణం - రోడ్డు ప్రమాదం వార్తలు
ఆగి ఉన్న వాహనాలను డీసీఎం ఢీ కొట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు గాయపడ్డారు.

ఆగిఉన్న వాహనాలను ఢీకొట్టిన మరో డీసీఎం... ఇద్దరు మృతి