రంగారెడ్డి జిల్లాలో రెండు రోడ్డు ప్రమాదాలు(telangana road accident)జరిగాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం ఇద్దరు దుర్మరణం చెందగా... ఎనిమిది మంది గాయపడ్డారు.
ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లా రావిర్యాల సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం(Road accident in telangana today) చోటుచేసుకుంది. రహదారిపై ఆగి ఉన్న లారీని ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రక్కు శంషాబాద్ నుంచి పెద్ద అంబర్‌పేట్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు ఇంజిన్‌లో ఇరుకున్న వ్యక్తిని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ప్రమాదం జరగ్గానే ఆగివున్న లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసులు తెలిపారు.
పర్యాటకుల వాహనానికి ప్రమాదం
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్లు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న పర్యాటకుల బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఏడుగురికి గాయాలు కాగా.. వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బాధితులు హసన్‌పర్తి మండలం దేవన్నపేట వాసులుగా గుర్తించారు. గోవా పర్యటనకు వెళ్లొస్తుండగా అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది.
ఎనిమిది కార్లు ఢీ..
రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ రింగురోడ్డు వద్ద అమెరికా తరహా రోడ్డు ప్రమాదం(ORR Accident hyderabad today) ఇటీవలె చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించుకోవడానికి కారు సడన్ బ్రేక్ వేయడం వల్ల దాని వెనుక వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది కార్లు(car accident today hyderabad) పరస్పరం ఢీకొన్నాయి. ఈ వాహనాల బ్యానెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టం తప్పడం వల్ల అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవలే తాను కారు కొన్నానని.. ఈ ప్రమాదంలో తన కారు బ్యానెట్ పూర్తిగా దెబ్బతిన్నదని ఓ వాహనదారుడు విచారం వ్యక్తం చేశాడు. కానీ ఎవరికి ఏం కాలేదని ఊపిరి పీల్చుకున్నారు.
అన్నాచెల్లెలు దుర్మరణం
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలో మరో ఘోరరోడ్డు ప్రమాదం(Road accident news today) జరిగింది. కొత్తూరు పరిధిలోని తిమ్మాపూర్ శివారులో లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో అన్నాచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్‌నగర్ జిల్లా ముసాపేట్ మండలం కొమ్మిరెడ్డిపల్లికి చెందిన చంద్రశేఖర్... హైదరాబాద్ జీడిమెట్లలో ఉంటున్నారు. వనపర్తి జిల్లాలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి సోదరి మమతతో కలిసి వెళ్లిన చంద్రశేఖర్.... తిరిగి హైదరాబాద్ వస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తూరు మీదుగా బైక్‌పై వేగంగా వస్తూ... పెట్రోల్ బంక్‌లోకి వెళ్తున్న లారీ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో యువతీయువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వివాహానికి వెళ్లి వస్తూ.. విగతజీవులుగా మారిన అన్నాచెల్లెలిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి:pahadishareef murder case 2021 : వదినపై కోపంతో ఆమె నాలుగేళ్ల కుమారుడిని చంపేశాడు!