తెలంగాణ

telangana

ETV Bharat / crime

హైదరాబాద్​లో కలుషిత నీళ్లు తాగి ఇద్దరు మృతి.. 10మందికిపైగా అస్వస్థత - rangareddy district crime news

Two people died drinking contaminated water: కలుషిత మంచి నీరు తాగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన రంగారెడ్జి జిల్లా మైలార్​ దేవ్​పల్లిలో చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఖైసర్ అనే యువకుడు, అఫ్రీన్ సుల్తానా(22) మృతి చెందగా.. మరో పది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Two people diedin rangareddy district
రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మృతి

By

Published : Dec 14, 2022, 7:11 PM IST

Two people died drinking contaminated water: రంగారెడ్డి జిల్లా మైలార్​దేవ్​పల్లిలో కలుషిత మంచి నీళ్లు తాగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వీళ్లతో పాటు ఆ జలాలు తాగడం ద్వారా మరి కొంత మంది అస్వస్థతకు గురయ్యారు. మొత్తం ముగ్గురు చిన్నారులు సహా 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖైసర్అనే యువకుడు, అఫ్రీన్ సుల్తానా(22) మృతి చెందారు.

మృతురాలు సుల్తానాకు 6నెలల కుమార్తె ఉండగా.. ఆ చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. దీనంతటికీ కలుషిత జలాలే కారణమని వైద్యులు తెలిపారు. జలమండలి మంచినీళ్లు కలుషితంగా వస్తున్నాయని అందువల్లే అందరూ అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జలమండలి అధికారులు: కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన ఘటనపై జలమండలి అధికారులు స్పందించారు. మైలార్​దేవ్​పల్లి మొఘల్ కాలనీలో జలమండలి అధికారులు నీటి నమూనాలు సేకరించారు. మొఘల్ కాలనీలో నీటి నమూనాలు సేకరిస్తున్నమని తెలిపారు. మంచినీరు కలుషితం కాలేదని స్పష్టం చేశారు. మైలార్​దేవ్​పల్లిలో పైపులైన్లను అధికారులు పరిశీలించారు. పైపులైన్‌ పరిశీలించిన వాటర్ వర్క్స్ మేనేజర్ అబ్దుల్ ఖదీర్​పై స్థానిక టీఆర్ఎస్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details